MedchalPoliticalTelangana
Trending

బాధితులకు తగిన న్యాయం జరిగే వరకు పోరాడుతా :డా. షైరాబాను

బాధితులకు తగిన న్యాయం జరిగే వరకు పోరాడుతా :డా. షైరాబాను

మేడ్చల్ జిల్లా, జూన్ 12: మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల లోనీ తన కార్యాలయంలో బాధితులతో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డా. షైరాబాను .ఈ సందర్భంగా డా. షైరాబాను మాట్లాడుతూ మే18 న దుద్దెడ గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికకు వివాహం జరిగింది. స్థానికంగా ఉండే వారు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారాన్ని అందించిన వారి పైన తప్పుడు కేసులను నమోదు చేశారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పోలీసుల అరాచకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనించగలరని వారు విజ్ఞప్తి చేశారు. ఎవరైతే బాధితులు మాకు అన్యాయం జరిగిందని వెళ్లిన వారి పైననే తప్పుడు క్రిమినల్ కేసులను నమోదు చేస్తున్నారని తెలిపారు.ఈ సంఘటన సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగింది.ఈ సంఘటన సుమారు 20వ తేదీ నుండి 28వ తేదీ మధ్యలో జరిగింది.మైనర్ అమ్మాయి పెళ్లిపై ఎలాంటి దర్యాప్తు కొనసాగుతుంది అని అడగడంతో పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ వారు మాకు ఒక నివేదిక ఇస్తే ఆ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని స్థానిక ఇన్స్పెక్టర్ తెలిపారు.దీంతో సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులను కలిసి మైనర్ బాలికకు17 సంవత్సరాల మూడు నెలలు అని వివరించడం జరిగింది.
పెళ్లి చేసిన పెళ్లి పెద్దల పైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అయితే మొత్తం 13, 14 మంది పెళ్లి చేసిన పెద్దలు ఉంటే కేవలం నలుగురి పైన మాత్రమే సిద్దిపేట రూరల్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు.
అదీ కూడామైనర్ బాలిక యొక్క తల్లిదండ్రుల పైన మాత్రమే కేసు నమోదు చేశారు.
ఇది ఎంతవరకు సమంజసం మైనర్ బాలిక వివాహం జరుగుతుంది అని సమాచారం ఇచ్చిన వారిపైన భౌతిక దాడులు చేసిన వారిపైన కేసులు నమోదు చేయలేదు. దీనిపై మేము హైకోర్టును మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
సమాచారం అందించిన వారిపైన తప్పుడు కేసుల విషయంపైన ఢిల్లీ హైకోర్టు ను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగే వరకు పోరాడుతామని వారు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button