BhadrachalamPoliticalTelangana

చికిత్స పొందుతు సర్పంచ్‌ మృతి… సర్పంచ్ మృతితో ఉద్రిక్తత…

చికిత్స పొందుతు సర్పంచ్‌ మృతి… సర్పంచ్ మృతితో ఉద్రిక్తత…

చికిత్స పొందుతు సర్పంచ్‌ మృతి… సర్పంచ్ మృతితో ఉద్రిక్తత…

Web desc : భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ సమీపంలో ఉన్న మిమిమ్స్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గిరిజన మహిళా సర్పంచ్ వెంకటరమణ మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామానికి చెందిన గిరిజన సర్పంచ్ వెంకటరమణ అనారోగ్యంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యులు స్పష్టమైన వివరాలు ఇవ్వలేదని, తమతో నిర్లక్ష్యంగా, రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని మృతురాలి బంధువులు ఆరోపించారు.

సర్పంచ్‌ భర్త ప్రేమ్‌కుమార్‌ కథనం మేరకు.. పాల్వంచ మండలం దంతలబోరు ఎస్సీకాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్‌ సోడే వెంకటరమణ(36) మూడేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడగా భద్రాచలంలో మోహన్‌రావు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు.

ఇటీవల అదే కాలుకు వాపు రావడం గమనించి బుధవారం మోహన్‌రావు ఆస్పత్రిలో చేరి్పంచారు. ఇన్‌ఫెక్షన్‌ మరింత పెరగడంతో ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు అంబులెన్స్‌లో ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి శుక్రవారం తరలించగా చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందింది. ఆమెకు భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

కాగా, చికిత్స లోపమే తన భార్య మృతికి కారణమని ఆరోపించిన ప్రేమ్‌కుమార్‌.. మృతదేహంతో శుక్రవారం రాత్రి నేరుగా భద్రాచలంలోని మోహన్‌రావు ఆస్పత్రి వద్దకు వెళ్లి బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు చేరుకుని చర్చిస్తున్నారు. కాగా, సర్పంచ్‌ మృతిపై ఎంపీడీఓ పి.రాజారావు, ఎంపీఓ షబ్నా సంతాపం తెలిపారు.

మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం మధ్యవర్తుల ద్వారా రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే వైద్యుల నిర్లక్ష్యంపై వచ్చిన ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button