
కొందుర్గ్ ఎంపీపీ నిధులపై కలకలం…!
•ప్రైవేట్ వ్యక్తులు డ్రైవర్ పేరుతో ప్రభుత్వ సొమ్ము విత్‌డ్రా చేశారా…?
•నిధుల అక్రమ విత్‌డ్రాలపై సమగ్ర విచారణ జరపాలి,
•బిల్లులు వౌచర్లు బ్యాంకు లావాదేవీలను పరిశీలించాలి,
•అక్రమాలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి,
•ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆనేగాళ్ళ ఆనంద్ మాదిగ,
,షాద్ నగ నియోజకవర్గ సి.కె న్యూస్ ప్రతినిధి,ఆగస్టు 13:
కొందుర్గ్ మండల ప్రజా పరిషత్‌లో ప్రభుత్వ నిధుల వినియోగం విత్‌డ్రాలపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా డ్రైవర్ పేరుతో సైతం విత్‌డ్రా చేసినట్లు ఆధారాలు ఉన్నాయని ఎమ్మార్పీఎస్ కొందుర్గ్ మండల అధ్యక్షుడు ఆనేగాళ్ళ ఆనంద్ మాదిగ ఆరోపించారు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజా సొమ్ము వినియోగంపై ప్రశ్నలు
ప్రభుత్వం మండల పరిధిలోని ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కేటాయించే నిధులను నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆనంద్ మాదిగ అన్నారు అయితే కొందుర్గ్ మండల ప్రజా పరిషత్‌లో నిధుల విత్‌డ్రాల విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు ప్రభుత్వ నిధులను ఎవరెవరి పేర్లపై విత్‌డ్రా చేశారు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఎందుకు విత్‌డ్రా చేయాల్సి వచ్చింది డ్రైవర్ పేరుతో నిధులు ఎందుకు తీసుకున్నారు ఆ నిధులను ఏయే పనులకు వినియోగించారు అనే అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు.
బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించాలి
నిధుల విత్‌డ్రాకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్లు చెక్కులు బిల్లులు వౌచర్లు తీర్మానాలు పనుల వివరాలు తదితర రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఆయన కోరారు ప్రభుత్వ నిధులు నిజంగా ప్రజా అవసరాలకే ఖర్చయ్యాయా లేక నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారా అన్నది విచారణ ద్వారా తేల్చాలని అన్నారు.
అక్రమాలు తేలితే చర్యలు తప్పవు
ప్రజల పన్నుల ద్వారా సమకూరే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం తీవ్రమైన విషయమని ఆనేగాళ్ళ ఆనంద్ మాదిగ అన్నారు ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిధుల దుర్వినియోగం లేదా అక్రమ విత్‌డ్రాలు జరిగినట్లు నిర్ధారణ అయితే సంబంధిత అధికారులు సిబ్బంది ఇతర బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉన్నతాధికారులు స్పందించాలి
ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆయన కోరారు ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత తీసుకురావడంతో పాటు ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు ఈ ఆరోపణలపై అధికారుల వివరణ విచారణ ఫలితాలు వెలువడాల్సి ఉంది.




