Mahabub badPoliticalTelangana

వర్ధన్నపేట మున్సిపాలిటీలో మళ్లీ ఎన్నికల కలకలం..!

వర్ధన్నపేట మున్సిపాలిటీలో మళ్లీ ఎన్నికల కలకలం..!

వర్ధన్నపేట మున్సిపాలిటీలో మళ్లీ ఎన్నికల కలకలం..!

కౌన్సిలర్‌ పదవికి అనర్హత వేటు పడేనా..?

సి కే న్యూస్ వర్ధన్నపేట : మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్‌ సిలివేరు కుమారస్వామి ఎన్నికపై వివాదం నెలకొంది. ప్రభుత్వ రేషన్‌ డీలర్‌గా కొనసాగుతున్న వ్యక్తి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారంటూ కాంగ్రెస్‌ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ లాభదాయక పదవిలో ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని వారు పేర్కొన్నారు.

రేషన్‌ డీలర్‌గా ఉంటూ కౌన్సిలర్‌గా..

తెలంగాణ మున్సిపల్‌ చట్టం–2019, భారత రాజ్యాంగంలోని 243-V అధికరణ ప్రకారం ప్రభుత్వ ఆధీనంలోని లాభదాయక పదవిలో ఉన్న వ్యక్తి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడంపై నిబంధనలు ఉన్నాయని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. రేషన్‌ డీలర్‌గా కొనసాగుతున్న సిలివేరు కుమారస్వామి ఎన్నికల సమయంలో ఆ పదవిలోనే ఉన్నారని ఆరోపించారు.

అధికారులకు ఫిర్యాదు

కౌన్సిలర్‌పై విచారణ జరిపి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకులు సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమగ్రంగా విచారణ చేయాలని కోరారు.

అనర్హత వేటు పడితే..

అధికారుల విచారణలో ఆరోపణలు నిజమని తేలి, ఎన్నికల నిబంధనల ప్రకారం అనర్హత వర్తిస్తే 11వ వార్డు కౌన్సిలర్‌ పదవి రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఖాళీ అయిన స్థానానికి మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించాల్సి రావచ్చని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. విచారణ అనంతరం వెలువడే అధికారిక నిర్ణయంపై 11వ వార్డు రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button