HealthPoliticalTelangana

సింథటిక్ కలర్స్‌తో కారా తయారీ.. వ్యక్తి అరెస్ట్..

సింథటిక్ కలర్స్‌తో కారా తయారీ.. వ్యక్తి అరెస్ట్..

సింథటిక్ కలర్స్‌తో కారా తయారీ.. వ్యక్తి అరెస్ట్..

మేడిపల్లి: చెంగిచెర్లలో అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగించి కారా తయారు చేస్తున్న వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో శ్రీమాతా అరవింద కాలనీలోని ఎస్‌వీఎస్ కార ఐటమ్స్ షాపులో అక్రమంగా కారా తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

ఈ మేరకు పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో షాపుపై దాడి చేశారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకుని విచారించారు. సోదాల్లో 30 కేజీల అప్పడాలు, 30 కేజీల మురుకులతో పాటు త్రీ స్టార్ లెమన్ ఎల్లో, త్రీ స్టార్ ఆరెంజ్ రెడ్ సింథటిక్ ఫుడ్ కలర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వ్యక్తిని తంబిదురై విష్ణు (28)గా గుర్తించారు. అవసరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో సింథటిక్ కలర్స్ ఉపయోగించి కారా తయారు చేసి సమీపంలోని హాట్‌చిప్స్ దుకాణాలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలను తదుపరి చర్యల కోసం పోలీసులు భద్రపరిచారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button