KhammamPoliticalTelangana

శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

సికే న్యూస్ ప్రతినిధి
ఖమ్మం: ఖమ్మం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో పాఠశాలకు హాజరై, ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ తమ తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. ఉపాధ్యాయుల బాధ్యతలు, వారి ప్రాముఖ్యతను స్వయంగా అనుభవిస్తూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన గొప్ప తత్వవేత్త, విద్యావేత్తగా మాత్రమే కాకుండా భారతదేశ ఉపరాష్ట్రపతిగా కూడా సేవలందించారు. సమాజ అభివృద్ధికి అవసరమైన జ్ఞానం, విజ్ఞానం, విలువలను విద్యార్థులకు అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్నే కాకుండా మొత్తం సమాజ భవిష్యత్తును సైతం మార్చగలడని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రావూరి నివేదిత మాట్లాడుతూ, ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడం మాత్రమే కాకుండా విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తారని అన్నారు. ఎన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చినా ఉపాధ్యాయుల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గదని పేర్కొన్నారు. శ్రీ చైతన్య పాఠశాలల్లో విద్యార్థుల్లోని సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించే విధంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. విద్యార్థులను ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడంలో పాఠశాల యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ , డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం చేతన్ మధుర్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button