
పోలీస్ స్కూల్ లో సాధారణ విద్యార్థులకు 50 శాతం సీట్లు
పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం పోలీసు సంక్షేమంలో కీలక భాగమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన లేకుండా చేస్తే పోలీసులు విధులపై మరింత దృష్టి సారిం చగలరన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని ఆక్టోపస్-గ్రేహౌండ్స్ ప్రాంగణంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అకడమిక్ బ్లాక్-1 నిర్మాణానికి డీజీపీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు సిబ్బందితోపాటు ఇతర వర్గాల పిల్లలకు కూడా అందుబాటులో ఉండేలా తక్కువ ఫీజుతో నాణ్య మైన విద్య అందించనున్నట్లు తెలిపారు. హోంగార్డుల పిల్లలకు కూడా ప్రవేశాల్లో అవకాశం కల్పి
స్తున్నామన్నారు. పాఠశాలలో 50 శాతం సీట్లు సాధారణ విద్యార్థులకు కూడా కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఆర్మీ, సైనిక్ స్కూళ్ల తరహాలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో వైఐపీఎస్ ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది ఏప్రిల్ లో తాత్కాలిక ప్రాంగ ణంలో 120 మంది విద్యార్థులతో పాఠశాల ప్రారంభమైందని, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య సుమారు 360కు చేరిందన్నారు. కొత్త భవనం పూర్తయి తే వచ్చే ఏడాది 700-720 మందికి చేరే అవకా శం ఉందని తెలిపారు. విద్యార్థుల్లో విద్య, క్రమశి క్షణతోపాటు క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు.




