HyderabadPoliticalTelangana

మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్

మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్

మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్

Social media viral : హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మియాపూర్‌-హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళను రైల్వే పోలీస్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, ఆమె జుట్టును పట్టుకొని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లడం గమనార్హం.

అయితే మహిళను కొట్టడం వెనుక కారణాలు ఏంటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సదరు మహిళను రైల్వే కానిస్టేబుల్‌ ఈడ్చుకెళుతున్న సమయంలో భర్త, కూతురు ఆమెను వదిలేయాలంటూ కానిస్టేబుల్‌ను వేడుకున్నారు.

కానీ మాట వినిపించుకోని కానిస్టేబుల్‌ వాళ్లను నెట్టివేసి ఆమెను తన వాహనం వద్దకు ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button