HealthHyderabadPoliticalTelangana

ఎర్రగడ్డ దవాఖాన నుంచి ఖైదీ పరార్‌

ఎర్రగడ్డ దవాఖాన నుంచి ఖైదీ పరార్‌

ఎర్రగడ్డ దవాఖాన నుంచి ఖైదీ పరార్‌

Web desc : పోక్సో కేసులో అరస్టైన నిందితుడు ఎర్రగడ్డ మానసిక దవాఖాన నుంచి పోలీసు ఎసార్ట్‌ కళ్లుగప్పి తప్పించుకున్న ఘటన బోరబండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

బోరబండ పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్‌ నగర్‌ జిల్లా అమరచింతకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ కిశోర్‌ కుమార్‌ రెడ్డి పోక్సో కేసులో అరస్టై చంచల్‌ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. వైద్య పరీక్షల కోసం మంగళవారం హెడ్‌ కానిస్టేబుల్‌ కోటేశ్వరరెడ్డి, కానిస్టేబుల్‌ రాహుల్‌ అతడిని ఎర్రగడ్డలోని మానసిక దవాఖానకు తీసుకువచ్చారు.

వైద్య పరీక్షల అనంతరం బాత్‌రూమ్‌కు వెళ్తానని చెప్పిన కిశోర్‌ కుమార్‌ రెడ్డి అకడికి వెళ్లి వెంటిలేటర్‌ నుంచి దూకి పరారయ్యాడు. పోలీసు సిబ్బంది గాలింపు చేపట్టినా అతడి ఆచూకీ దొరకలేదు. ఎసార్ట్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button