PoliticalTelangana

ప్రియుడితో కలిసి భర్తను హ*త్య చేసిన భార్య!

ప్రియుడితో కలిసి భర్తను హ*త్య చేసిన భార్య!

ప్రియుడితో కలిసి భర్తను హ*త్య చేసిన భార్య!

Web desc : భూపాలపల్లి మండలం గొల్ల బుద్ధారం గ్రామానికి చెందిన అజ్మీరా చందు నాయక్(39) భార్య పావని తన ప్రియుడితో కలిసి గురువారం రాత్రి 1 గంట సమయంలో అతి దారుణంగా చంపేశారు.వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ధరావత్ సంతోష్ పావనితో గత కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం.

ఈ విషయంలో పావని భర్త చందు నాయక్ తరచుగా గొడవ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో చందు నాయక్‌ను అడ్డు తొలగించాలని భార్య పావని తన ప్రియుడు సంతోష్‌లు కలిసి ప్లాన్ వేసుకున్నట్లు తెలిసింది. అంతేకాక ఈ విషయంలో గత మూడు రోజుల క్రితం పంచాయతీ చేయాలని స్థానిక సర్పంచ్ వద్దకు వెళ్తే శుక్రవారం పంచాయతీకి సమయం ఇచ్చినట్లు సమాచారం.

దీంతో పంచాయతీలో పూర్తి సమాచారం బట్టబయలవుతుందని ముందస్తుగానే పావని తన ప్రియుడితో కలిసి రాత్రి ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న చందు నాయక్‌ను అతి దారుణంగా చంపినట్లు తెలుస్తోంది. అనంతరం శవాన్ని ఎడ్ల బండిలో చికినపల్లి శివారులో పడవేసినట్లు సమాచారం.

ఈ విషయం గ్రామస్తుల ద్వారా పోలీసులకు సమాచారం అందడంతో భూపాలపల్లి డి.ఎస్.పి ఏ.సంపత్ రావు భూపాలపల్లి గణపురం సిఐలు శ్రీనివాస్ కరుణాకర్ రావు ఎస్సై పవన్ సంఘటన స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button