
ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.4లక్షలు డిమాండ్ చేసిన్రు..కాంగ్రెస్ లీడర్ సంచలన ఆరోపణ
Web desc : మానకొండూర్ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేరుచెప్పి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బండారి రమేశ్, నర్సింగాపూర్సర్పంచ్రూ.4లక్షలు డిమాండ్చేశారని శంకరపట్నం మండలం అంబాల్పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గొల్లెన తిరుపతి తీవ్ర ఆరోపణలు చేశాడు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామంలోని సర్వే నంబర్-69లో మట్టి తవ్వకాల కోసం మైనింగ్ శాఖ నుంచి తాత్కాలిక పర్మిట్ పొందానన్నారు. గత అక్టోబర్ 7నుంచి డిసెంబర్ 5వరకు పర్మిషన్ ఉండగా, అక్టోబర్ 10న పనులు ప్రారంభించామని చెప్పారు.
పని ప్రారంభించిన కొద్ది రోజులకే కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారి రమేశ్, నర్సింగాపూర్ సర్పంచ్ పెరిక రవి కలిసి ‘ఎమ్మెల్యే డబ్బులు అడుగుతున్నారు.. పని జరగాలంటే రూ.4 లక్షలివ్వాలి’ అని డిమాండ్ చేయడంతోపాటు అక్టోబర్ 14న నర్సింగాపూర్ సర్పంచ్ తనను ఇంటికి పిలిపించుకొని బెదిరించారని చెప్పారు.
మొదటగా ఫోన్ పేలో కొంత అమౌంట్ పంపానని, మరికొంత నగదు రూపంలో మొత్తం 2 లక్షలు ఇచ్చానని చెప్పారు. మిగతా డబ్బులు ఆలస్యం కావడంతో తనను మానసికంగా వేధించి, మైనింగ్, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తన పర్మిట్లను రద్దు చేయించి, తన టిప్పర్లను నిలిపివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ లీడర్లు బ్లాక్ దందా చేసే వారికి వత్తాసు పలుకుతూ రాత్రికిరాత్రే మట్టిని తరలించుకునేలా చూస్తున్నారని ఆరోపించాడు. తనకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యేతో పాటు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కల్పించుకొని తనకు న్యాయం చేయాలని కోరారు.




