HyderabadPoliticalTelangana

పోలీస్ శాఖలో కలకలం.. అడ్డంగా దొరికిపోయిన లేడీ ఎస్ఐ

పోలీస్ శాఖలో కలకలం.. అడ్డంగా దొరికిపోయిన లేడీ ఎస్ఐ

పోలీస్ శాఖలో కలకలం.. అడ్డంగా దొరికిపోయిన లేడీ ఎస్ఐ

Web desc : శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించాల్సిన ఓ యువ మహిళా ఎస్సై, బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే అవినీతికి తెరలేపి ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోయారు. కుల్సుంపుర సబ్‌డివిజన్‌ పరిధిలోని ఓ కీలక ఠాణాలో విధులు నిర్వహిస్తున్న 2024 బ్యాచ్‌కు చెందిన మహిళా ఎస్సైపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.

ప్రొబేషనరీ కాలం సైతం పూర్తికాకముందే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీసీలోనే ఆధారాలతో నిలదీత.. ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ)లో సదరు మహిళా ఎస్సై వ్యవహార శైలిపై సీపీ సజ్జనార్‌ కీలక ఆధారాలను ప్రస్తావించారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారుల నుంచి వసూళ్లు, సివిల్‌ తగాదాల్లో తలదూర్చడం వంటి అంశాలపై పక్కా సమాచారంతో ఆమెను నిలదీసినట్లు తెలిసింది.

విధుల్లో చేరిన స్వల్ప వ్యవధిలోనే ‘టీ20’ తరహాలో వేగంగా అవినీతికి పాల్పడటంపై సీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెను ప్రస్తుత పోలీసు స్టేషన్‌ విధుల నుంచి రిలీవ్‌ చేయాలని ఆదేశించడంతో, అధికారులు ఆమెను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.

కానిస్టేబుళ్లపైనా వేటుకు రంగం సిద్ధం.. ఈ అవినీతి వ్యవహారంలో మహిళా ఎస్సైకి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు సిబ్బందిపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందులో ఒక ఏఆర్‌ కానిస్టేబుల్‌తో పాటు మరొక సివిల్‌ కానిస్టేబుల్‌ పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

వీరిద్దరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. శిక్షణ పూర్తి చేసుకుని ఉత్సాహంగా విధుల్లోకి రావాల్సిన 2024 బ్యాచ్‌ అధికారిణి, ఆదిలోనే అవినీతి మరక అంటించుకుని వేటుకు గురికావడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button