
గురుకుల స్కూల్లో లైంగిక వేధింపుల కలకలం… విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి..?
Web desc : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ లో వంటమనిషి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఘటన కలకలం రేపింది. రూ.500, 1000 ఇస్తా వస్తారా అని విద్యార్థినులను గత కొంత కాలంగా వంట మనిషి వేధిస్తున్నట్లు తెలిసింది.
సుమారు 20 మంది విద్యార్థి నులను వేధించినట్టు సమాచారం. కాగా, ఈ విషయం బయటకు పొక్కకుండా విద్యార్థినులను ప్రిన్సిపాల్ బెదిరించినట్లు తెలిసింది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో గుట్టు చప్పుడు కాకుండా వంట మనిషిని ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి అక్కడ నుంచి పంపించివేశారు.
దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ మీడియాను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




