
యువకుడిని కొట్టి చంపిన లాడ్జింగ్ యాజమాన్యం
భద్రాచలంలో రామాలయం ఏరియాలో సోమవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసు కుంది. లాడ్జి అద్దె విషయంలో మొదలైన చిన్నపాటి వాగ్వాదం చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. రామాలయం సమీపంలోని శ్రీ సత్యసాయి లాడ్జింగ్ వద్ద యువకుల మధ్య జరిగిన ఘర్షణలో తెల్లం శరత్ (25)అనే యువకుడు మృతి చెందాడు.
రూమ్ అద్దె, ఆధార్ కార్డు, రేషన్ కార్డు విషయంలో మొదలైన వివాదం.. లాడ్జి సిబ్బంది పిడి గుద్దులతో దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు శరత్కు అక్సి డింట్ ఆయందని చిత్రీకరించేందుకు లాడ్జ్ నిర్వాహకులు తెల్లం శరత్‌ను ఆసుపత్రికి తరలించగ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
భద్రాచలంలో జొమాటోలో పనిచేస్తున్న తెల్లం శరత్ వద్దకు హైదరాబాద్ నుంచి అతని స్నేహితులు రావడంతో.. వారంతా కలిసి లాడ్జిలో రూమ్ తీసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న యువకులు రూమ్ కావాలని అడగగా.. లాడ్జి నిర్వాహకులు 600 రూపాయలు అద్దెగా చెప్పినట్లు సమాచారం.
అయితే 500 రూపాయలు మాత్రమే ఇస్తాను అని చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో లాడ్జి యజమాని తన వద్ద పనిచేసే వ్యక్తిని పిలవగా.. అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి శరత్ అనే వ్యక్తిపై పిడిగుద్దులతో దాడి చేశారు. ఈ దాడిలో శరత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అతనితో వచ్చిన స్నేహితులపై కూడా దాడి చేయగా.. ఒకరు అక్కడి నుంచి పారిపోగా, మరొకరు అక్కడే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు…ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.




