MedchalPoliticalTelangana

'నన్ను మర్చిపో' అని ప్రియుడు మెసేజ్.. మనస్తాపంతో యువతి ఆత్మ*హత్య

'నన్ను మర్చిపో' అని ప్రియుడు మెసేజ్.. మనస్తాపంతో యువతి ఆత్మ*హత్య

‘నన్ను మర్చిపో’ అని ప్రియుడు మెసేజ్.. మనస్తాపంతో యువతి ఆత్మ*హత్య

Web desc : మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్‌సీ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ తర్వాత వివాహానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్ఎఫ్‌సీ నగర్ నివాసి దర్నబోయిన జంగయ్య కుమార్తె ఐశ్వర్య (22) ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉప్పల్‌కు చెందిన జామ కిరణ్‌కుమార్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకోగా, ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించారు.

అయితే, దీపావళికి ముందు కిరణ్‌కుమార్ తల్లి ఈ వివాహానికి అంగీకరించకపోవడంతో, అతను కూడా ఐశ్వర్యతో మాట్లాడటం ఆపేశాడు. ఈ క్రమంలో నవంబర్ 17న తనను మర్చిపోయి, కుటుంబ సభ్యులు చూసిన వేరే సంబంధం చేసుకోవాలంటూ ఐశ్వర్యకు మెసేజ్ పంపాడు.

కిరణ్‌కుమార్ సందేశంతో తీవ్ర వేదనకు గురైన ఐశ్వర్య, నవంబర్ 18న ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకర ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ నవంబర్ 19న ఉదయం 8.59 గంటలకు ఐశ్వర్య తుదిశ్వాస విడిచారు. కిరణ్‌కుమార్ ప్రేమించి పెళ్లికి నిరాకరించడం వల్లే తన కుమార్తె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button