
మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంట్లో ఈడి దాడులు..
Web desc : మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ అరెస్టుకు రంగం సిద్ధం..! ఖానాపూర్, హైదరాబాద్ నివాసాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ సోదాలు..!సీఎంఆర్ అవకతవకలపై గతంలోనే కేసు..! నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖ నాయక్ ను పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఉదయ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (cmr) అవకతవకల వ్యవహారంలో గత ఆగస్ట్ లో రేఖా నాయక్ పై కేసు నమోదు అయ్యింది.
ఏఆర్ఎస్ ( అజ్మీరా రేఖ శ్యాం నాయక్ ) మిల్లు యజమానిగా కొనసాగుతున్న రేఖా నాయక్. 2022 నుండి 2025 వరకు మూడు రబీ సీజన్ ల సీఎంఆర్ ధాన్యంలో రూ.40.96 కోట్ల విలువ చేసే 9,639 మెట్రిక్ టన్నుల ధాన్యం అవకతవకులకు పాల్పడినట్టు గతంలో గుర్తించి విజిలెన్స్ అదికారులు కేసులు నమోదు చేశారు. ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుండి ఆమె నివాస గృహాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ సోదాలు కలకలం రేపుతున్నాయి.
అధికార కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆమెను అరెస్ట్ చేస్తారంటూ స్థానికంగా ప్రచారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్, ఖానాపూర్ రేఖానాయక్ నివాసంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. రేఖా నాయక్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేయడంతో ఖానాపూర్ లో ఉత్కంఠత నెలకొంది.




