
యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ క్రాంతి కుమార్ ను సత్కరించిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో యూత్ కాంగ్రెస్ విస్తరణ, బలోపేతానికి విశేష కృషి చేసినందుకు యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ కె. క్రాంతి కుమార్ ను తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జెక్కిడి శివ చరణ్ రెడ్డి శుక్రవారం ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సత్కరించారు. యూత్ కాంగ్రెస్ చేపట్టిన ఆన్ లైన్ పోర్టల్ విధానంలో ప్రత్యేకత చాటడంలో క్రాంతి కుమార్ ముందంజలో నిలిచారు.
ఈ సందర్భంగా.. జెక్కిడి శివ చరణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఇన్ చార్జ్ దీపక్ ప్రజ్ఞా ప్రత్యేకంగా సత్కరించారు. భవిష్యత్తులోనూ.. మరింతగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.