PoliticalTelanganaUncategorized

బట్టబయలైన 250 కోట్ల భారీ కుంభకోణం…?

బట్టబయలైన 250 కోట్ల భారీ కుంభకోణం…?

చైన్ సిస్టంతో సూర్యాపేట జిల్లాలోనే భారీ స్కాం

మూడు జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన కుంభకోణం

లబోదిబోమంటున్న వందలాది మంది బాధితులు

సూర్యాపేట :

లక్షలు కాదు.. కోట్లలో ఎగబాకి సుమారు 200 కోట్లకు పైగా భారీ కుంభకోణానికి దారితీసింది. ఒక వ్యక్తి 50 వేలు కడితే నెలకి లక్ష రూపాయలు ఇస్తానంటూ ఘరానా మోసం వ్యక్తి 50 వేల రూపాయలు కట్టి ఆ వ్యక్తి నలుగురిని చేర్పిస్తే అతనికి లక్ష రూపాయలు వస్తాయని నమ్మబలికిచ్చి సుమారు కొన్ని వందల మంది బాధితులను చేసి 200 కోట్ల స్కాం చేశారు.

50 వేల నుండి 10 లక్షల వరకు కడితే మీకు డబల్ వస్తాయంటూ మోసం చేశారు. కోదాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు, హుజూర్నగర్ మండలం మాధవరాయనీ గూడెంకు చెందిన ముగ్గురు వ్యక్తులు, గరిడేపల్లి మండలం చెందిన ఇద్దరు వ్యక్తులు ,

నేలకొండపల్లి ఖమ్మం జిల్లాకు చెందిన కొంత మంది తోపాటు విజయవాడకు చెందిన మెయిన్ లీడర్ ను పతంగి టోల్ ప్లాజా దగ్గర స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపు లోకి తీసుకున్నట్లు సమాచారం… విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబో అంటూ గోడు వెల్లపుచ్చుకుంటున్నారు.

లక్షకి రెండు లక్షలు 10 లక్షల 20 లక్షలు అంటూ జనాలను నట్టేట ముంచారు. ఈ కుంభ కోణంలో ఇంకా ఎంతమంది హస్తముందో అనే కోణంలో విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button