
ఏసీబీ కి చిక్కిన ఖమ్మం తూనికల శాఖాధికారి
తూనికలు, కొలతల శాఖ ఖమ్మం జిల్లా అధికారి ప్రవీణ్ కుమార్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.
వేబ్రిడ్జి ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు ఓ ఏజెంట్ ను రూ. 10 వేలు డిమాండ్ చేయగా, రూ.5వేలకు ఒప్పందం కుదిరింది.
బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ రమేశ్ బృందం కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా ప్రవీణ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.




