
దమ్ముంటే ఇంటి దొంగ పేరు బయటపెట్టు…జగ్గారెడ్డికి ఎమ్మెల్యే ప్రభాకర్ సవాల్
మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై కాంగ్రెస్ నేతల హస్తం ఉందని, దమ్ముంటే ఇంటి దొంగల గుట్టు బయట పెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(బీఆర్ఎస్)..
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన సంగారెడ్డిలోని క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ప్రతిపక్షాలను విమర్శించే ముందు కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత రాజకీయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ ప్రక్రియను అడ్డుకునేలా సమాచారం ఇచ్చింది ఇక్కడి నాయకులేనన్న ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితురాలైన మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచాడనే ఆరోపణలపై కాంగ్రెస్ ఎందుకు మౌనం పాటిస్తోందన్నారు. కాంగ్రెస్‌లోని కోవర్టుల వ్యవహారాన్ని బయటపెట్టినందుకే హరీశ్‌రావుపై కాంగ్రెస్ లీడర్లు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.




