ManchiryalaPoliticalTelangana

సీఎం కుర్చీ.. నీ జాగీరా.. బ్యాలెట్‌ బాక్స్‌లో రిటైర్డ్‌ టీచర్‌ లేఖ...

సీఎం కుర్చీ.. నీ జాగీరా.. బ్యాలెట్‌ బాక్స్‌లో రిటైర్డ్‌ టీచర్‌ లేఖ...

సీఎం కుర్చీ.. నీ జాగీరా.. బ్యాలెట్‌ బాక్స్‌లో రిటైర్డ్‌ టీచర్‌ లేఖ…

Web desc : ఓ రిటైర్డ్‌ టీచర్‌ తాన బాధను వెళ్లగక్కుతూ బ్యాలెట్‌ బాక్సులో ఓ చీటి వేశారు. మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని 14వ వార్డుకు చెందిన పోలింగ్‌ బూత్‌ డబ్బాలో ఈ చీటి వెలుగులోకి వచ్చింది.

అందులో ఆయ న తన ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఆ లేఖలో రాసిన వివరాల ప్రకారం.. ‘నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 2024 నవంబర్‌లో రిటైర్‌ అయ్యాను. రిటైర్మెంట్‌ బకాయిలు, నేను దాచుకున్న డబ్బులు రూపాయి కూడా రాలేదు.

దీనికి కారణం కాంగ్రెస్‌ ప్రభుత్వం. రేవంత్‌రెడ్డిది మోసకారి.. దగా ప్రభు త్వం. రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉసురు తగులుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రివర్గం అంతా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

అయ్యా.. సీఎం గారు.. మీరు కేటీఆర్‌ను నీ అయ్య జాగీరా? సీఎం కుర్చీ అన్నారు. నేనూ మిమ్మల్ని అడుగుతున్నా.. సీఎం కుర్చీ నీ అయ్య జాగీరా?.. నీ తాత జాగీరా? నీ మనుమడి జాగీరా?’ అని సదరు రిటైర్డ్‌ టీచర్‌ ఆ లేఖలో ప్రశ్నించారు.

మా రిటైర్మెంట్‌ బెనిఫిట్లు ఎక్కడ?

‘ఓ కాంగ్రెస్‌ ప్రభుత్వమా! మా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఎక్కడ’ అంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ సర్కార్‌కు రిటైర్డ్‌ ఉద్యోగులు ప్రశ్నల వర్షం కురిపించారు. మున్సిపల్‌ ఎన్నికలు వేదికగా రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.

ప్రభుత్వం తమ వినతులను పరిగణనలోకి తీసుకోకపోవడంతో బ్యాలెట్‌ బాక్స్‌ల ద్వారా తమ గోడును వెల్లబోసుకున్నారు. మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు తర్వాత పలు బ్యాలెట్‌ బాక్సుల్లో రిటైర్మెంట్‌ పొందిన ఓటర్ల నిరసన పత్రాలు దర్శనమిచ్చాయి.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఓ బ్యాలెట్‌ బాక్స్‌ తెరువగా ఓ రిటైర్డ్‌ ఉద్యోగి రాసిన నిరసన పత్రం బయటపడింది. సూర్యాపేట, యాదగిరిగుట్ట బ్యాలెట్‌ బాక్సుల్లో కూడా ఇలాంటివే పలు దర్శనమిచ్చాయి.

‘ఓ కాంగ్రెస్‌ ప్రభుత్వమా? మేము రిటైర్మెంటై 15 నెలలు గడిచింది. మాకు రావాల్సిన, మీరు చెల్లించాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్లు ఒక్క పైసా చెల్లించలేదు. ఇవ్వలేదు.

మా కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అనారోగ్యాలతో దవాఖానల్లో మెరుగైన వైద్యం చెల్లించుకోలేకపోతున్నాం. ఆ బాధల తో 62 మంది చనిపోయారు.

మేం చనిపోయే ముందైనా మా డబ్బులు మాకివ్వండి’ అంటూ రిటైర్డ్‌ ఉద్యోగు లు ప్రశ్నలు సంధించడం సర్కార్‌ నిర్ల క్ష్య వైఖరికి నిదర్శనంగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు సర్కార్‌కు భారీ ఝలక్‌ ఇచ్చారు.

పలు డివిజన్లు, వార్డుల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో ఇతర పార్టీల కన్నా కాంగ్రెస్‌ అభ్యర్థులకు తక్కువ ఓట్లు రాగా, కొన్ని డివిజన్లల్లో ఆ పార్టీకి సున్నా ఓట్లే వచ్చాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button