KarimnagarPoliticalTelangana

కాంగ్రెస్‌ రిగ్గింగ్‌ చేసింది.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

కాంగ్రెస్‌ రిగ్గింగ్‌ చేసింది.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

కాంగ్రెస్‌ రిగ్గింగ్‌ చేసింది.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ హుజూరారాబాద్‌లో రిగ్గింగ్‌కు పాల్పడిందని.. స్ట్రాంగ్‌ రూం తాళంచెవి మిస్‌ కావడమే ఇందుకు సాక్ష్యమని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు.

స్ట్రాంగ్‌ రూం తాళం పగలగొట్టే సమయంలో మీడియాను రానివ్వకపోవడం, సీసీ పుటేజీలు తొలగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. వెంటనే స్ట్రాంగ్‌రూం తాళం మిస్సింగ్‌పై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఒక్కపూట స్ట్రాంగ్‌ రూం తాళం చెవిని కాపాడలేని అధికారులు ఉన్న తరుణంలో.. బ్యాలెట్‌ బాక్సులు భద్రంగా ఉన్నాయా? అనే అనుమానాలు వస్తున్నట్లు తెలిపారు.

తాళం చేవి మిస్సింగ్‌పై ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, కోర్టులో ఫిట్‌ దాఖలు చేస్తానన్నారు.

సీసీ కెమెరాల డాటా రికవరీ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 16న జరిగే హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికను రద్దు చేయాలని ఆర్డీవోకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్‌ రాష్ట్ర మాజీ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు కొండాల్‌రెడ్డి, నాయకులు గందె శ్రీనివాస్‌, రవీందర్‌రావు. మారపెల్లి సుశీల, కిరణ్‌కుమార్‌, రమేశ్‌, భిక్షపతి, ఇమ్రాన్‌, గఫర్‌ పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button