
10,954 GPO గ్రూప్-4 పోస్టుల నోటిఫికేషన్ సిద్ధం.. వెంటనే ఈ వివరాలు చూడండి
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీ సంఖ్యలో ‘గ్రామ పాలనా అధికారుల’ (Grama Palana Officers – GPO) పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. సుమారు 10,954 పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం గతంలో VRO వ్యవస్థను రద్దు చేసి, ఈ విభాగంలోని ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా వేరే శాఖల్లో పని చేస్తున్న మాజీ VROలు, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న మాజీ VRAలను బదిలీ పద్ధతిలో GPO ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
మిగతా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, పౌరులకు, రెవిన్యూ యంత్రాంగానికి మధ్య ముఖ్యమైన వారధిగా పనిచేయడం ఈ గ్రామ పాలనా అధికారుల బాధ్యతలు.
తెలంగాణ GPO నోటిఫికేషన్ 2026
తెలంగాణ GPO రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్, అప్లికేషన్ షెడ్యూల్ ఇంకా అధికారికంగా విడుదల కాలేదు.
అయితే తెలుగు న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తల ప్రకారం.. అఫీషియల్ నోటిఫికేషన్ త్వరలో https://ccla.telangana.gov.in/ వెబ్సైట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్య, అర్హత వివరాలు మాత్రమే వెల్లడయ్యాయి. విద్యార్హతలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అయితే గతంలో VRO లేదా VRAలుగా పనిచేసిన వారు ఈ పోస్టులకు రావాలనుకుంటే.. వారికి ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండాలి, అలాగే కనీసం 5 ఏళ్ల సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ వచ్చిన ఏడాది జులై 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. BC/EWS/PwD వర్గాలకు సంబంధించిన వయోపరిమితి సడలింపు వివరాలు నోటిఫికేషన్లో వెల్లడిస్తారు.
ప్రొబేషన్ పీరియడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా GPO పోస్టులకు ఎంపికైన వారికి మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. బదిలీపై వచ్చే పాత రెవిన్యూ ఉద్యోగులకు మాత్రం ఒక్క సంవత్సరం మాత్రమే ప్రొబేషన్ ఉంటుంది.
ఈ సమయంలో ఉద్యోగి పనితీరును విశ్లేషించిన తర్వాతే సర్వీస్‌లో కొనసాగించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అభ్యర్థులు ముందుగానే ప్రభుత్వానికి బాండ్ రాసివ్వాల్సి ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్, రూల్స్ అప్లికెంట్స్‌కి ముందు రాత పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో మెరిట్లో ఉన్న వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి, పోస్టులకు సెలక్ట్ చేస్తారు. ఈ పోస్టులకు ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుంటారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే రిక్రూట్మెంట్ జరుగుతుంది.
అపాయింటింగ్ అథారిటీగా కలెక్టర్లే వ్యవహరిస్తారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. GPOలుగా ఎంపికైన వారు రెండేళ్లలో డిపార్ట్మెంటల్ టెస్టులు కచ్చితంగా పాస్ అవ్వాలి. లేదంటే వారిని ఉద్యోగాల నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.




