PoliticalsuryapetaTelangana

సూర్యాపేటలో దా*రుణం.. ప్రియురాలు దూరం పెడుతోందని!

సూర్యాపేటలో దా*రుణం.. ప్రియురాలు దూరం పెడుతోందని!

సూర్యాపేటలో దా*రుణం.. ప్రియురాలు దూరం పెడుతోందని!

సూర్యాపేట పట్టణంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలు దూరం పెడుతోందని ఆమెపై సుత్తితో దాడి చేశాడు.

స్నేహనగర్ లో యువతి నివాసం ఉంటుండగా ఆమె ఇంట్లోకి దూరి తలపై సుత్తితో దాడి చేశాడు. యువతి తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుండి హైదరాబాద్ తీసుకువెళ్లారు. దాడి చేసిన అనంతరం స్థానికులు నిందితుడిని పట్టుకుని స్థంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

ఇదిలా ఉంటే యువతి, యువకుడు ఇద్దరూ పక్కపక్కన గ్రామాలకు చెందినవారేనని తెలుస్తోంది. ఎనిమిదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా యువతి ఒంటరిగా సూర్యాపేటలోనే ఉంటున్నట్టు తెలుస్తోంది.

ప్రేమోన్మాది దాడితో సూర్యాపేటలో ఒక్కసారిగా భయాందోళనకర వాతావరణం నెలకొంది. ఇక నిన్న హైదరాబాద్ వనస్థలిపురంలోనూ ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది.

విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుందని మాజీ భర్త మహిళ నివాసానికి వచ్చి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడిక్కడే మరణించింది. ఈ ఘటన మర్చిపోకముందే రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button