HyderabadPoliticalTelangana

నా అన్వేషణ అన్వేష్కు షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు

నా అన్వేషణ అన్వేష్కు షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు

నా అన్వేషణ అన్వేష్కు షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు

Web desc : యూట్యూబర్, నా అన్వేషణ అన్వేష్ కు పంజాగుట్ట పోలీసులు షాకిచ్చారు. బుధవారం (ఫిబ్రవరి 25) లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవలే అన్వేష్ ఇన్ స్టా అకౌంట్ను మెటా బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత తనకు రెండు ఇంస్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని వీడియో విడుదల చేశాడు.

ఇన్ స్టా అకౌంట్ బ్యాన్ తర్వాత.. అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ అన్వేష్ వీడియో విడుదల చేశాడు. దీంతో మరో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గురించి మెటాకు లేఖ రాయనున్నారు పోలీసులు.

అంతే కాకుండా యూట్యూబ్ కు కూడా పంజాగుట్ట పోలీసులు లేఖను రాయనున్నారు. ఇటీవల జరిగిన పరిణామాల క్రమంలో లేటెస్టుగా నా అన్వేష్ కు లుకౌట్ నోటీసులు జారీ పోలీసులు.

యూట్యూబర్ అన్వేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటి..? పోతే ఏంటి..? అంటూ అన్వేష్ ఒక వీడియో విడుదల చేశాడు. తన ఇన్ స్టాగ్రామ్ పోతే బాధపడతా అనుకున్నారా బత్తాయిలు అంటూ కామెంట్ చేశాడు.

”రెండు ఇన్ స్టాగ్రాములు నా రెండు చేతులు, రెండు యూట్యూబ్ ఛానళ్లు.. నా రెండు కాళ్లు, నా ఫేస్ బుక్ నా శరీరం భాగం .. ఈ ఐదు భాగాలని నడిపించేది నా తెలివైన బుర్ర… తెలివైన బుర్ర ఉంది కాబట్టే ఎంతో మందిని నిద్రలేకుండా చేస్తున్న..

ఒక చెయ్యి లాంటి నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ పోయిన మరొక చెయ్యి లాంటి ఇంస్టాగ్రామ్ ఉంది.. మరొక instagramని తీసేసిన మిగిలిన భాగాలైన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్తో ముందుకు పోతాను.. చివరికి నా తలతో అయినా మాట్లాడి ముందుకు వెళ్తాను..

నేను దొరికితే డైరెక్ట్గా నా తల నరికేయాలి.. నేను ఎవరిని దేకను, నేను ఎలాంటి మోసాలు చేయలేదు.. నాకు ఫాలోవర్స్ ఉంటే ఏంటి.. పోతే ఏంటి..? నిద్ర పట్టనివ్వను,ఎవరిని వదలను’ అని అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి దారితీశాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button