HyderabadPoliticalTelangana

ఎస్బీఐ ఉద్యోగి రాంగ్‌ రూట్ నిర్లక్ష్యం.. ఆర్టీసీ బస్సు కిందపడి ఓయూ ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం!

ఎస్బీఐ ఉద్యోగి రాంగ్‌ రూట్ నిర్లక్ష్యం.. ఆర్టీసీ బస్సు కిందపడి ఓయూ ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం!

ఎస్బీఐ ఉద్యోగి రాంగ్‌ రూట్ నిర్లక్ష్యం.. ఆర్టీసీ బస్సు కిందపడి ఓయూ ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం!

Web desc : రోడ్డుపై ఒకరి నిర్లక్ష్యం మరొకరి కొంపముంచింది. ఎస్బీఐ ఉద్యోగి చేసిన రాంగ్‌ రూట్ డ్రైవింగ్ వల్ల ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థిని నిండు ప్రాణం బలైంది. తండ్రితో కలిసి బైక్‌పై కళాశాలకు వెళ్తుండగా ఎదురుగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన వాహనాన్ని తప్పించబోయి, అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కిందపడి విద్యార్థిని అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని హఫీజ్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఆరీఫ్‌ కుమార్తె షేక్‌ ఆయిషా ముస్ఫిరా (21) ఉస్మానియా యూనివర్సిటీ (OU) ఇంజినీరింగ్‌ కళాశాలలో బీఈ మైనింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం ఆరీఫ్‌ తన కుమార్తె ఆయిషాను ద్విచక్రవాహనంపై కళాశాలకు తీసుకువెళ్తున్నాడు.

ఈ క్రమంలో నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి సిగ్నల్స్‌ వద్ద ఉన్న షైలా కేఫ్‌ సమీపానికి వారు చేరుకున్నారు. అదే సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగి ఒకరు వేగంగా రాంగ్‌ రూట్‌లో బైక్‌పై ఎదురుగా దూసుకొచ్చాడు. ఆ బైక్‌ను ఢీకొట్టకుండా ఉండేందుకు ఆరీఫ్‌ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు.

దీంతో ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి ఎడమవైపు పడిపోగా, వెనుక కూర్చున్న ఆయిషా మాత్రం కుడివైపు రోడ్డుపై పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద ఆమె చిక్కుకుపోయింది. ఈ దారుణ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయిషా ముస్ఫిరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button