HanumakondaPoliticalTelangana

ధర్మసాగర్ లో మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన మండల కమిటీ ఎన్నిక.

ధర్మసాగర్ లో మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన మండల కమిటీ ఎన్నిక.

ధర్మసాగర్ లో మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన మండల కమిటీ ఎన్నిక.

సీకే న్యూస్ నవంబర్ 9 సోమవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ప్రతినిధి కమలాకర్

విజ్ఞానం, వివేకం, వికాసంలో మాదిగ విద్యార్థులు ముందుకెళ్లాలి.
.హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ.

మాదిగ విద్యార్థులు ఎమ్మార్పీఎస్ సాధించి పెట్టిన ఎస్సీ వర్గీకరణ ఫలాలను సంపూర్ణంగా ఉపయోగించుకొని విజ్ఞానం, వివేకం, వికాసంలో మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ ఏపూరి వెంకటేశ్వర్లు మాదిగ అన్నారు. ధర్మసాగర్ లోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, మండల ఎమ్మెస్ ఎఫ్ సదస్సు జరిగింది. ఈ సదస్సు సింగారపు పవన్ మాదిగ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా ఇంచార్జ్ పాల్గొన్న ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ, కో ఇంచార్జి తడుగుల విజయ్ మాదిగ గంగారపు శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కావడం వల్ల 9 శాతం రిజర్వేషన్లు మాదిగలకు అందుతున్నాయని అన్నారు. అయితే జనాభా ప్రాతిపదికన మాదిగలకు ఇవ్వవలసిన రిజర్వేషన్లను ఇంకా పెంచాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లో అమలవుతున్న వర్గీకరణ చట్టం వల్ల 9% రిజర్వేషన్లతో మాదిగలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పట్టారని అన్నారు. వర్గీకరణను సాధించిన మంద కృష్ణ మాదిగను నేటితరం మాత్రమే విద్యార్థులు మరచిపోవద్దని అన్నారు. నేటి విద్యార్థులు వ్యక్తిగతంగా తమ జీవిత లక్ష్యాలను సాధించుకుంటూనే సామాజిక బాధ్యతగా జాతి అభివృద్ధి కోసం నిలబడాలని అన్నారు. మొన్నటి తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే నివేదికలో మాదిగల్లో అక్షరాస్యత రేటు అతి తక్కువగా ఉన్నదని వెల్లడి అయిందని, కావున మాదిగల్లో అక్షరాస్యత పెంచడం కోసం ప్రతి మాదిగ విద్యార్థి బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. మాదిగల్లో ప్రస్తుత తరం మరియు భవిష్యత్ తరాలు చదువుకునే విధంగా ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత నేడు చదువుకుంటున్న మాదిగ విద్యార్థుల మీద అన్నారు. మాదిగ విద్యార్థుల సంక్షేమం కోసం మరెవరు రారని ఎమ్మెస్ ఎఫ్ మాత్రమే సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని అన్నారు.కావున ప్రతి మాదిగ విద్యార్థి ఎమ్మెస్ ఎఫ్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన ఎమ్మెస్ ఎఫ్ మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులు కొయ్యడ గౌతం మాదిగ మాదిగ అధికార ప్రతినిధి కొలిపాక సర్జన్ మాదిగ ప్రధాన కార్యదర్శి కనకం అక్షిత మాదిగ

ఉపాధ్యక్షులుగా –
కుర్సపల్లి ఆదిత్య మాదిగ కందుకూరి సందేశ్ వర్మ మాదిగ,పసునూరి వికాస్ మాదిగ,కార్యదర్శిలుగ వాస్కుల రోహిత్ మాదిగ
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు,ఎమ్మార్పీఎస్ , ఎమ్మెస్ ఎఫ్ హనుమకొండ జిల్లా కో ఇంచార్జ్ బొడ్డు శాంతి సాగర్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి అనుబంధ సంఘాల మండల నాయకులు పాల్గొన్నారు..గొల్లపల్లి అనిల్ మాదిగ,సోంపల్లి అన్వేష్ మాదిగ, వక్కల అక్షిత్ మాదిగ,కనకం అనిల్ మాదిగ,నక్క ప్రవీణ్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button