
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ని రాష్ట్రంలో బలోపితం చేయండి- టీజేఏ పౌండర్ ఉప్పల లక్ష్మణ్.
జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుదాం-టి జే ఏ రాష్ట్ర అధ్యక్షుడు- కేవీ రమణారావు
Ck news హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్ టీజేఏ స్టేట్ కమిటీకి పిలుపునిచ్చారు.
ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ను టీజేఏ రాష్ట్ర కార్యాలయం బుద్ధ భవన్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు,వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఘోరి, nuji వైస్ ప్రెసిడెంట్ రాజేంద్రనాథ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి. శ్రీనివాస్,ఎండి ఖలీల్, ఖాసీం, మోహన్ యాదవ్, ck news chairman బి. ఉపేందర్, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు భారీ గా పాల్గొన్నారు.



