PoliticalTelanganaUncategorized

నమిలె సాయితేజ జయంతి సందర్భంగా అనాదాశ్రమం లో అన్నదానం

నమిలె సాయితేజ జయంతి సందర్భంగా అనాదాశ్రమం లో అన్నదానం

నమిలె సాయితేజ జయంతి సందర్భంగా అనాదాశ్రమం లో అన్నదానం

సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 07

యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు కు చెందిన నమిలె సాయితేజ జయంతి సందర్భంగా వంగపల్లి లోని “అమ్మఒడి అనాదాశ్రమం”లో బుధవారం అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా చిన్నకందుకూరు మాజీ సర్పంచ్ నమిలె పాండు మాట్లాడుతూ చిన్న వయసులోనే కుటుంబ సభ్యులను, స్నేహితులను విడిచి వెళ్ళిన సాయితేజ జ్ఞాపకాలు మా వెంటే ఉంటాయని ఆయన అన్నారు.

నమిలె సాయితేజ జయంతి,వర్థంతులను అనాదాశ్రమం లో జరుపుకుంటామని ఆయన తెలిపారు. “అమ్మఒడి అనాదాశ్రమానికి” మా వంతు సహాయ సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్, సాయితేజ కుటుంబ సభ్యులు అఖిల, శ్రావణి,అనాధ ఆశ్రమ నిర్వాహకులు చింతకింది దివ్య,సాయితేజ మిత్రులు నమిలె అభిషేక్,శ్రీకాంత్, సాయికుమార్,రాజేష్ మనోహర్,మధు,బలరాం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button