HyderabadPoliticalTelangana

ఇబ్రహీం పట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత…

ఇబ్రహీం పట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత…

ఇబ్రహీం పట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత…

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (90) కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మార్చి 13న ఉదయం 8.45 గంటలకు తన ఇంట్లో మృతి చెందారు.

ఇటీవల ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కొడుకు త్రిలోక్ కుమార్ 12వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు.

కొండిగారి రాములు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా 1989, 1994లలో రెండు సార్లు సీపీఎం పార్టీ తరపున గెలుపొందారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన నికార్సైన కమ్యూనిస్టు ఉద్యమ నేతగా, నిస్వార్ధ నాయకుడిగా కొండిగారి రాములు పెరుపొందాడు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికి ఆర్థికంగా సాధారణ జీవితం గడిపారు. ఆయన సొంత గ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అరుట్ల కాగా ఇబ్రహీంపట్నంలోని బృందావన్ కాలనీలో స్థిరపడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button