Yadadri
Trending

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలి

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలి

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలి

ఎంపీ చామలకి వినతిపత్రం అందజేసిన తెలంగాణా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా

హైదరాబాద్ , మార్చ్ 15 ,

యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పలు సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు . ఇందిరమ్మ గృహ పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని అని అడిగిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు . జర్నలిస్టులకు ప్రజా పాలన ప్రభుత్వం మీకు పూర్తిగా అండగా ఉంటుందని అన్నారు .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button