
‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’.. పేషంట్‌తో డాక్టర్ అసభ్య ప్రవర్తన
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్‌పై అసభ్య ప్రవర్తన ఆరోపణలు రావడంతో స్థానికంగా కలకలం రేగింది.
వివరాల్లోకి వెళితే.. తొర్రూరులోని విజయలక్ష్మి హాస్పిటల్‌లో డా. కిరణ్ కుమార్ వద్ద జ్వరానికి చికిత్స కోసం 21 ఏళ్ల యువతి చేరగా, చికిత్సలో భాగంగా ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం డాక్టర్ యువతితో అనుచితంగా ప్రవర్తించాడని, “నువ్వు చాలా అందంగా ఉన్నావు” అంటూ ముట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనపై యువతి వెంటనే తన తల్లికి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లి మరో ఆసుపత్రిలో యువతికి చికిత్స అందించినట్లు తెలిసింది. ఆదివారం ఉదయం యువతి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను ప్రశ్నించగా వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ సమయంలో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్‌పై దాడి చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డాక్టర్ కిరణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తొర్రూరు పట్టణంలో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


