HyderabadKarimnagarPoliticalTelangana

పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు… ?

పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు… ?

పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు… ?

Social media viral : హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహరం పై ఈ రోజు అసెంబ్లీలో దుమారం చెలరేగింది. ఆయన వైఖరిని కాంగ్రెస్ శాసనసభ్యులు తప్పు పట్టారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మైనింగ్ అక్రమాల పై ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి లేచి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. గత ప్రభుత్వ పెద్దలు భూములు ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు.

ఈ సమయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిగ్గరగా అరుస్తూ.. ఇంతకీ ఏ పార్టీలో ఉన్నావ్ అంటూ ప్రశ్నించారు. ఈ సమయంలో కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరిని బెదిరించారని వారు ఆరోపించారు, గన్తో కాల్చి పడేస్తానని కౌశిక్ చేయితో సైగలు చేశారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలపై మాట్లాడిన మంత్రులు కౌశిక్ రెడ్డి వీడియో పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కౌశిక్రెడ్డిని ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, కౌశిక్ రెడ్డి తీరుపై ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశలో అడుగులు వేస్తోంది. కౌశిక్ రెడ్డి తీరును మంత్రులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖండించారు. ఆయనపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి తీరుపై ఎథిక్స్ కమిటీకి సిపారసు చేస్తున్నట్లు తెలిపారు.

దీనిపై స్పందించిన స్పీకర్ ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. ఆయన తప్పు చేసినట్లు నిరూపణ అయితే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఆయనపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో అసెంబ్లీ సమావేశాల సమయంలోహెడ్ ఫోన్స్ విసిరి దాడి చేశారనే ఆరోపణలు రావడంతో ప్రతిపక్ష సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాన్ని నాడు స్పీకర్ రద్దు చేశారు.

అనంతరం వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించగా వారి సభ్యత్వాల రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా పాడి కౌశిక్ రెడ్డి విషయంలోనూ ప్రభుత్వం అదే చర్యలకు దిగితే బీఆర్ఎస్ ఏం చేస్తుందనేది చర్చనీయంశంగా మారింది.

అయితే సస్పెండ్ చేయకుండా ఆయనను కొంతకాలం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని, సభ్యత్వం రద్దు చేస్తే గతంలో జరిగినట్లే తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button