HyderabadPoliticalTelangana

వాషింగ్ మిషన్ లో షార్ట్ సర్క్యూట్..

వాషింగ్ మిషన్ లో షార్ట్ సర్క్యూట్..

వాషింగ్ మిషన్ లో షార్ట్ సర్క్యూట్..

వాషింగ్ మిషన్ లో షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటన నార్సింగ్ కి సర్కిల్ పరిధిలోని మణికొండ అల్కాపురి కాలనీ రోడ్ నెంబర్ 25 సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది.

ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్కపురి కాలనీ ఎంజి పార్క్ తరువాత ఉన్న రిద్ధిస్ గ్రాండ్ యువర్ అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులో ఓ ఫ్లాట్‌లో ఉన్న వాషింగ్ మిషన్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో నివాసితులు భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదాన్ని గమనించిన ఫ్లాట్ యజమాని తన భార్య, ఇద్దరు పిల్లలతో వెంటనే బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు వ్యాపిస్తాయేమోనని మూడో అంతస్తులోని నివాసితులు తీవ్ర భయాందోళన చెందారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందని వివరాలు తెలియ రాలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button