HyderabadPoliticalTelangana

వెంగళరావునగర్‎లో అగ్ని ప్రమాదం.. గోల్డ్ ట్రేడింగ్ కంపెనీలో చెలరేగిన మంటలు

వెంగళరావునగర్‎లో అగ్ని ప్రమాదం.. గోల్డ్ ట్రేడింగ్ కంపెనీలో చెలరేగిన మంటలు

వెంగళరావునగర్‎లో అగ్ని ప్రమాదం.. గోల్డ్ ట్రేడింగ్ కంపెనీలో చెలరేగిన మంటలు

Web desc : హైదరాబాద్‎లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (మార్చి 31) రాత్రి 7 గంటల సమయంలో వెంగళరావునగర్‎లోని వింధ్య బులియన్ గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఆఫీస్ మొదటి అంతస్థులోని ఏసీ నుంచి ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే రెండో అంతస్తుకు వ్యాపించాయి. ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న సనత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగిసపడుతోన్న మంటలను ఫైరింజన్ల సహయంతో అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

కార్యాలయంలోని కంప్యూటర్లు, ఏసీలు, ఇంటర్నల్ క్యాబిన్స్ దగ్ధమవడంతో భారీగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button