NijamabadPoliticalTelangana

విద్యార్థినులు బట్టలు మార్చుకుంటుండగా ఫోటోలు తీసి మార్ఫింగ్..

విద్యార్థినులు బట్టలు మార్చుకుంటుండగా ఫోటోలు తీసి మార్ఫింగ్..

విద్యార్థినులు బట్టలు మార్చుకుంటుండగా ఫోటోలు తీసి మార్ఫింగ్.. పోలీసుల అదుపులో బ్యూటీషియన్ కోర్స్ ట్రైనర్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలో గల పెర్కిట్ దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రం వద్ద ఇటీవల తీవ్ర వివాదం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఈ ఏడాది మార్చి నెల 2 వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్స్ నేర్పేందుకు ట్రైనర్‌గా స్నేహ వచ్చారు.

అయితే మహిళా ప్రాంగణంలోని విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటుండగా బ్యూటీషియన్ కోర్స్ ట్రైనర్ స్నేహ విద్యార్థినుల ఫోటోలు తీసి, ఆమెకు తెలిసిన జిల్లా కేంద్రానికి చెందిన సతీష్ అనే వ్యక్తికి షేర్ చేసినట్లు తెలిసింది. దీంతో మహిళా ప్రాంగణ విద్యార్థుల మార్పింగ్ ఫోటోలు వైరల్‌గా మారడంతో ఈ విషయంపై తీవ్ర వివాదం చోటుచేసుకుంది.

బ్యూటీషన్ ట్రైనర్ స్నేహను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహిళా ప్రాంగణంలోని బ్యూటీషియన్ ట్రైనర్ స్నేహ పంపిన ఫోటోలను, జిల్లా కేంద్రానికి చెందిన సతీష్ అనే వ్యక్తి అతనికి తెలిసిన గ్రూప్‌లో ఉన్న కొందరు విద్యార్థినిలకు అసభ్యంగా ప్రవర్తించే విధంగా వాట్సాప్ చాటింగ్ చేసినట్టు తెలిసింది. మహిళా ప్రాంగణంలో ట్రైనింగ్ ఇస్తున్న ఈ బ్యూటీషియన్ కోర్సులో 28 మంది విద్యార్థినిలు శిక్షణ పొందుతున్నారు.

మార్ఫింగ్ ఫోటోల వైరల్‌కు ప్రధాన కారణమైన బ్యూటీషియన్ ట్రైనర్ స్నేహను ఆర్మూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆర్మూర్ ఏసీపీ జె.వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్య నారాయణ గౌడ్, షీటీం బృంద సభ్యులు సైతం మహిళా ప్రాంగణంలోని విద్యార్థుల మార్పింగ్ ఫోటోల వైరల్ అంశంపై విచారణ చేస్తున్నారు.

విద్యార్థి సంఘాల ఆందోళన.. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెరికిట్‌లో గల మహిళా ప్రాంగణంలో, బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందేందుకు వచ్చిన విద్యార్థినుల పట్ల ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటని మహిళా ప్రాంగణం ముందు ధర్నా నిర్వహించిన పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిద్ధల నాగరాజు, దుర్గాప్రసాద్, నిఖిల్ లు పేర్కొన్నారు.

ఈ ధర్నా నేపథ్యంలో మహిళా ప్రాంగణంలో ఇలాంటి పనులు జరగడం పట్ల బాధ్యత వహించని ప్రాంగణం అధికారిని విధుల్లోంచి తప్పుకోవాలని వారు డిమాండ్ చేశారు. మహిళా ప్రాంగణంలో విద్యార్థుల మార్పింగ్ ఫోటోలను వైరల్ చేయడానికి కారకులపై జిల్లా పాలన అధికారి, జిల్లా పోలీస్ అధికారి ప్రత్యేకంగా దృష్టి సారించి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button