
బాబు మోహన్ చేతుల మీదుగా కురవి యువకుడికి డిజిటల్ ఐకాన్ అవార్డు
కురవి మండలానికి చెందిన మమిడాల భర్గవ్‌కు హైదరాబాద్‌లో జరిగిన “ఆరోగ్య మహోత్సవ్–2026”లో డిజిటల్ ఐకాన్ అవార్డు లభించింది. ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా ఆయన సత్కారం పొందారు. ఫుడ్ & లైఫ్‌స్టైల్ రంగంలో సోషల్ మీడియాలో వినూత్న కంటెంట్‌తో గుర్తింపు పొందిన భర్గవ్ ఈ అవార్డు సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.




