KhammamKusumanchiPoliticalTelangana

కూసుమంచి తండా యువకుడికి రూ.1.50కోట్ల ప్యాకేజీ!

కూసుమంచి తండా యువకుడికి రూ.1.50కోట్ల ప్యాకేజీ!

కూసుమంచి తండా యువకుడికి రూ.1.50కోట్ల ప్యాకేజీ!

కూసుమంచి : పట్టుదల, కష్టపడి చదివేతత్వం ఉంటే పల్లెటూరి నుంచి కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చని ఖమ్మం జిల్లా యువకుడు హలావత్‌ సుభాష్‌ చంద్రసాయి నిరూపించారు. ఏడాదికి సుమారు రూ.1.50 కోట్ల భారీ వేతన ప్యాకేజీతో అమెరికాలో ప్రముఖ గ్లోబల్‌టెక్‌ సంస్థ ‘ఫ్యూజీఫిల్మ్‌ ఇంజనీర్‌ కంపెనీ’లో సీనియర్‌ ఇంజనీర్‌గా కొలువు సాధించారు.

డిసెంబరు 14న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన సత్యం-ధనలక్ష్మి దంపతుల ఇద్దరు కుమారుల్లో సుభాష్‌ చంద్రసాయి ఒకరు. తండ్రి ప్రైవేటు ఉద్యోగి కాగా, తల్లి ఆర్లగూడెం గిరిజన సంక్షేమ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.

ఇంటర్‌ వరకు ఖమ్మంలో చదివిన సుభాష్‌.. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. అనంతరం ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లి అక్కడే మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ సైతం పూర్తి చేశారు.

ఈ క్రమంలో పరిశోధన ప్రాజెక్టు పూర్తి చేసిన 19మందిలో ఒక్క సుభాష్ కు ఈ ప్రతిష్ఠాత్మక ఉద్యోగం దక్కడం విశేషం. తన ఉన్నతికి తల్లిదండ్రులతో పాటు తాతయ్య భద్రయ్య ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే కారణమని సుభాష్‌ తెలిపారు. కుమారుడు అమెరికాలో భారీ వేతనంతో ఉద్యోగం సాధించడం పట్ల తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button