HanumakondaPoliticalTelangana

హనుమకొండలో హై టెన్షన్.. కాంగ్రెస్, BRS కార్యాలయాల దగ్గర భారీగా పోలీసులు

హనుమకొండలో హై టెన్షన్.. కాంగ్రెస్, BRS కార్యాలయాల దగ్గర భారీగా పోలీసులు

హనుమకొండలో హై టెన్షన్.. కాంగ్రెస్, BRS కార్యాలయాల దగ్గర భారీగా పోలీసులు

Web desc : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య చోటుచేసుకున్న పరస్పర దాడుల ఘటనలతో హనుమకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కీలక ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

కార్యాలయానికి సమీపంలోనే ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సైతం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య మళ్లీ ఘర్షణలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టారు.

క్యాంపు కార్యాలయంపై దాడి దుర్మార్గం: ఎమ్మెల్యే నాయిని తన క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను సైతం భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు.అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చకు రావాలని తాము సవాల్ చేస్తే, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

కేటీఆర్‌ను చర్చకు రావాలని కోరితే, కొందరు రచ్చ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని, తనను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు.మరోసారి తన క్యాంపు కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా సహించేది లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు తమ పద్ధతి మార్చుకోవాలని వ్యాఖ్యానించారు.

తమ పార్టీ నాయకులు ప్రభుత్వ జీవోలు సహా ఆధారాలతో వచ్చారన్నారు.పార్టీ శ్రేణులు సంయమనం పాటించాయని నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. దాడులు, ప్రతిదాడులు తమ రాజకీయ సంస్కృతి కాదని పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button