
డిగ్రీ అర్హతతో యూనియన్ బ్యాంకులో 1,865 ఉద్యోగాలు..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఖాళీలు ఉండగా తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి ప్రాధాన్యం లభించింది.
ఆంధ్రప్రదేశ్ – 303 పోస్టులు, తెలంగాణ – 164 పోస్టులు
బ్యాంకింగ్ రంగంలో అనుభవం సంపాదించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2026 ఏప్రిల్ 1 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
2026 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు:
కనిష్టం – 20 సంవత్సరాలు
గరిష్టం – 28 సంవత్సరాలు
ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
ఓబీసీ అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
దివ్యాంగులకు – 10 సంవత్సరాలు
శిక్షణ పొందే బ్రాంచ్ ప్రాంతాన్ని బట్టి స్టయిఫండ్ చెల్లించబడుతుంది.
రూరల్, సెమీ అర్బన్ బ్రాంచ్లు – రూ.15,000
అర్బన్ బ్రాంచ్లు – రూ.18,000
మెట్రో నగరాలు – రూ.20,000
ఆన్లైన్ రాత పరీక్ష
మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు.
జనరల్ / ఫైనాన్షియల్ అవేర్నెస్
జనరల్ ఇంగ్లిష్
క్వాంటిటేటివ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్
కంప్యూటర్ నాలెడ్జ్
యూనియన్ బ్యాంక్ ప్రొడక్ట్స్ & సర్వీసెస్
పరీక్ష సమయం
60 నిమిషాలు
నెగెటివ్ మార్కింగ్ లేదు
స్థానిక భాషా ప్రావీణ్యం తప్పనిసరి
ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్థానిక భాషా పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసిన రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. టెన్త్ లేదా ఇంటర్లో స్థానిక భాష చదివి ఉండాలి.
ఆన్లైన్ చివరి తేదీ : 19 మే 2026
ఆన్లైన్ పరీక్ష : మే / జూన్ 2026లో
వెబ్సైట్ : www.unionbankofindia.co.in




