
ఒరేయ్. నీకెందుకురా ? అసలు నువ్వెవడివి??.. ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ ఫైర్ !!
Social media viral : నసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ వర్సెస్ తెలంగాణ నేతల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా చర్చకు తెరలేపింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలకు నటుడు ప్రకాష్ రాజ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అలానే ప్రకాష్ రాజ్ కి సైతం పవన్ వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేష్ నెక్స్ట్ లెవెల్ కౌంటర్ ఇచ్చారు.
ప్రకాష్ రాజ్ ట్వీట్..
“మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి ” అని ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరుని మెన్షన్ చేయనప్పటికీ.. జనసేనాని గురించే అని క్లియర్ గా అర్థమవుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే పలుమార్లు ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కర్ణాటక ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు డిపాజిట్ కూడా దక్కలేదని.. ‘మా’ ఎన్నికల్లో కూడా ఓడిపోయారని జనసైనికులు కామెంట్స్ చేస్తున్నారు.
బండ్ల గణేష్ పోస్ట్..
అయితే ప్రకాశ్ రాజ్ పోస్టుపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఎక్స్ వేదికగా ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి అత్యంత తీవ్ర పదజాలంతో బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారింది. ఆ ట్వీట్ లో.. ఒరేయ్… నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? అంటూ విరుచుకుపడ్డారు. ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అలానే ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే కనిపిస్తావని.. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వద్దంటూ తీవ్రంగా హెచ్చరించారు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. బండ్ల గణేష్.. తెలుగు ప్రేక్షకులకు ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సూర్య వంశం, సుస్వాగతం, సాంబయ్య, మనసులో మాట, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, ఆంధ్రావాలా, పోకిరి, 143 వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలానే ఆ తర్వాత నిర్మాతగా మారి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించారు. రవితేజ నటించిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారగా.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. 2015లో వచ్చిన ‘టెంపర్’ చిత్రం తర్వాత సినీ నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నారు.




