
గిరిప్రదక్షిణలో దారుణం
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు యువతులపై అత్యాచారం
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణ దారిలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల్లో ఇద్దరు యు వతులపై అత్యాచారం జరిగింది. గత నెల 30న తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఓ వివాహిత తన స్నేహితులతో కలిసి తిరువణ్ణా మలై పౌర్ణమి గిరిప్రదక్షిణకు వచ్చింది. స్నేహి తులంతా గిరి ప్రదక్షణ చేసుకుని తిరుగు ప్రయాణం అవ్వగా వివాహిత, ఆమె స్నేహితు డు వాహనం ఆపి మాట్లాడుతున్న సమయం లో ఓ ముఠా మారణాయుధాలతో వారి వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడి వివాహితను అట వీప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్ప డింది. వివాహితతో పాటు ఆమె స్నేహుతుడి
దుస్తులు సైతం తీసి వారిని నగ్నంగా వీడియో తీసి అక్కడ నుండి పారిపోయింది. మరుసటి రోజు నగ్నవీడియోలను వారికి పంపి రూ. లక్ష పంపాలని లేదంటే వీడియోలు సోషల్ మీడి యాలో పెడతామని బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఆ వివాహిత ధర్మ పురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరుసటి రోజే రాత్రి తిరువణ్ణా మలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి గిరిప్రదక్షిణ చేస్తుండగా ఓ ముఠా ఇద్దరినీ బెదిరిం చి అటవీప్రాంతానికి తీసుకెళ్లి యవతిపై లైంగిక దాడికి పాల్పడింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు ఐదు బృందాలుగా నిందితుల కోసం దర్యాప్తు చేపట్టి 11 మంది నిందితులను గుర్తించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.




