Hyderabad
Trending

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై జీహెచ్‌ఎంసీ అధికారులం దాడి…

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై జీహెచ్‌ఎంసీ అధికారులం దాడి…

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై జీహెచ్‌ఎంసీ అధికారులం దాడి…

మమ్మల్నే ఆపుతావా? మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికీ లేదు..

రహదారిపై అపసవ్య దిశలో రావడాన్ని నిలువరించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్‌ సర్కిల్‌-36 ఉద్యోగులిద్దరినీ శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌-14లోని లూసిడ్‌ ఆస్పత్రి రోడ్డులో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు కార్లు, ట్యాంకర్లు, లారీలు వెళ్లకుండా నిషేధం విధించి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. గురువారం మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్‌ సర్కిల్‌-36 శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అమిత్‌కుమార్, ఏఈ పుప్పాల ఆనంద్‌ కారులో ఇటువైపు వెళ్లేందుకు యత్నించారు. విధుల్లో ఉన్న బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ శ్రీశైలం ఇలా వెళ్లడానికి వీల్లేదని మర్యాదగా చెప్పాడు. జీహెచ్‌ఎంసీ ఆఫీసర్లం.. మమ్మల్నే అడ్డుకుంటావా? అంటూ ఆనంద్‌ దుర్భాషలాడుతూ కానిస్టేబుల్‌ శ్రీశైలంపై దాడికి దిగాడు. మేం జీహెచ్‌ఎంసీ అధికారులం.. మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ హెచ్చరించాడు. నీ అంతుచూస్తాం.. నిన్ను ఇక్కడి నుంచి బదిలీ చేస్తామంటూ అమిత్‌కుమార్‌ సదరు కానిస్టేబుల్‌ను ఫొటోలు తీస్తూ బారికేడ్లను తొలగించి కారులో ఉడాయించారు. శ్రీశైలం ఫిర్యాదు మేరకు అమిత్‌కుమార్, ఆనంద్‌లపై బంజారాహిల్స్‌ పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 121 (1), 132, 352, 351 (2) కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఠాణాలోనూ వీరు ప్రతాపం చూపేందుకు యత్నించడం కొసమెరుపు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button