
వరంగల్‌లో సాప్ట్ వేర్ ఉద్యోగిని బలవన్మరణం…
Web desc : ఇటీవల కొంత మంది యువతీ, యువకులు ప్రతి సమస్యల్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.
జాబ్ లు, వ్యక్తిగత జీవితంలో తరచుగా ఎదురౌతున్న సమస్యలతో అల్లాడిపోతున్నారు. కొంత మంది తమ సమస్యల్ని తమకు నచ్చిన కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పంచుకుంటారు.
మరికొంత మంది ఇలాంటి సిట్యువేషన్ లో డాక్టర్లు లేదా నిపుణుల వద్దకు వెళ్తారు. మొత్తంగా ఆ సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. కానీ మరికొంత మంది మాత్రం తమకు సమస్యలు ఎదురైతే సూసైడ్ ఒక్కటే పరిష్కరమన్నట్లు నిర్ణయాలు తీసుకుంటారు. క్షణికావేశంలో నిండు నూరెళ్ల జీవితంను ముగించేసుకుంటారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో ఈ కోవకు చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
వరంగల్ జిల్లాలోని కాశీ బుగ్గ ప్రారంలో ఉండే గంజి కీర్తన అనే యువతి బెంగళూరులో ఒక ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంది. అయితే.. గత కొన్ని రోజులుగా ఉద్యోగ విషయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది.
తన బాధను ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పడంతో వరంగల్ కు తీసుకొచ్చేశారు. కొంత కాలంగా లీవ్ తీసుకుని చికిత్స తీసుకుంటుంది. ప్రతి రోజు వైద్యులు గంజి కీర్తనకు కౌన్సెలింగ్ ఇచ్చేవారు.
కానీ ఆమె మాత్రం ఏదో కోల్పోయిన విధంగా ఒక్కతే ఉండేందుకు చూసేది. ఎవరితో మాట్లాడకుండా ఫ్రెండ్స్ తో సైతం కలిసేది కాదు. ఈ క్రమంలో గత మూడు నెలల నుంచి కాశీబుగ్గ తిలక్ రోడ్డులోని ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటుంది.
ఇటీవల తల్లిదండ్రులు లేని సమయంలో.. గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని కీర్తన ఆత్మహత్యకు పాల్పడింది. బైట నుంచి వచ్చిన తల్లిదండ్రులు డోర్ ఎంతకు తెరవక పోయే సరికి డోర్ ను పగలగొట్టి చూడగా కూతురు ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించింది. దీంతో షాక్ కు గురై గుండెలు పగిలేలా తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.
వెంటనే చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు టెకీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు కీర్తన మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. యువ టెకీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా అందరిని కలిచివేసేదిగా మారింది.




