KhammamPoliticalTelangana

పారిశుద్ధ్యం పనులు మరచిన- పంచాయతీ సిబ్బంది

పారిశుద్ధ్యం పనులు మరచిన- పంచాయతీ సిబ్బంది

పారిశుద్ధ్యం పనులు మరచిన- పంచాయతీ సిబ్బంది
తన సొంత ఖర్చులతో పారిశుద్ధ పనులు చేయించుకుంటున్న గ్రామస్తులు

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో పాశుద్యం పనులు పక్కదారి పట్టాయి గ్రామ సభల్లో మరియు పలుమార్లు నేరుగా కలిసి తమ ఇంటి ముందు ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థలో మెరుగుపడుతుందని ఎన్నిసార్లు విన్నవించుకున్న పెడచెవి పెట్టి చూస్తున్న పంచాయతీ పాలకవర్గం అనే గ్రామస్తులు వాపోతున్నారు.

చిన్న మండవ టు పోలంపల్లి వెళ్లే దారిలో పర్చ గాని కృష్ణ ఇంటి వద్ద మురికి నీరు వర్షాకాలం మొదలైన కాలం నుంచి ఉంటున్నాయని, వాటి వల్ల దోమలు మరియు చీడపురుగులు దాన్లోకి చేరి విష జ్వరాలు, మొదలగు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పలుమార్లు వారు గ్రామపంచాయతీ పాలకవర్గానికి గ్రామసభల్లోన నేరుగాను తెలియపరచగా వారు ఇంతవరకు చర్యలు తీసుకోకుండా ఉండటంపై పంచాయతీ పాలకవర్గంపై విసుకు చెందే ఉన్నారు

తమ సొంత ఖర్చులతోటి వర్షాకాలంలో నిలిచిన నీరు చెరును తలపిస్తున్న విధంగా ఉంది దాన్లో అనేక రకాల ఈగలు దోమలు విషపూరిత జీవులు చేరి ప్రమాదకరంగా ఉన్నాయని దాని చుట్టూ పెరిగిన చెత్త పిచ్చి చెట్లు గడ్డి చెట్లు వంటి నీ జెసిబి సహాయంతో పంచాయతీ పాలకవర్గం చేయవలసిన పనులు కూడా వారే చేయించుకుంటున్నారు.

అసలు జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం వర్షాకాలం వచ్చిన వెంటే గ్రామంలో ఎక్కడ కూడా మురికినీరు నిల్వ ఉండకుండా, చెడు దోమలు పురుగులు ఈగల వంటివి చేరకుండా చెత్త పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నా సరే వాటిని పట్టించుకోకుండా మేమేం చేసిన అడిగే వారు లేరనే ఆలోచనతో చిన్న మండవ గ్రామ పాలకవర్గం వివరిస్తున్న తీరుపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button