HyderabadPoliticalTelangana

లైంగిక వేధింపుల వ్యవహారంలో CI శ్రీనివాసులుపై కేసు

లైంగిక వేధింపుల వ్యవహారంలో CI శ్రీనివాసులుపై కేసు

లైంగిక వేధింపుల వ్యవహారంలో CI శ్రీనివాసులుపై కేసు

WEB DESC : సీఐ శ్రీనివాసులు రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. తనను లైంగికంగా వేధించాడన్న ఓ మహిళా ఫిర్యాదు మేరకు అమీన్‎పూర్ పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఇప్పటికే సీఐ శ్రీనివాసులు రెడ్డిని హైదరాబాద్ సీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

అసలేం జరిగిందంటే..?

ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను నమ్మించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ అంతర్గత విచారణకు ఆదేశించారు. పోలీసుల విచారణలో సీఐ శ్రీనివాసులు రెడ్డి మహిళను నమ్మించి, ఆమెపై లైంగిక వేధింపులకు నిర్ధారణ అయ్యింది.

బాధితురాలి వ్యక్తిగత వీడియోలను అడ్డంగా పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. కొంతకాలం పాటు సీఐ శ్రీనివాసులు రెడ్డి, బాధిత మహిళ ఒకే ఇంట్లో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆమెను వదిలించుకునేందుకు సీఐ వివిధ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

సీఐ శ్రీనివాసులపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button