Mahabub badPoliticalTelangana

‘ఎలాగైనా నా భర్తను చంపు.. లేదంటే నేను చనిపోతా’

‘ఎలాగైనా నా భర్తను చంపు.. లేదంటే నేను చనిపోతా’

‘ఎలాగైనా నా భర్తను చంపు.. లేదంటే నేను చనిపోతా’

భార్య చాటింగ్‌తో షాక్‌కు గురైన భర్త.. డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్

డోర్నకల్,సి కే న్యూస్ : భర్తను హత్య చేయాలని ప్రియుడిని కోరుతూ భార్య పంపినట్లు చెబుతున్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సందేశాలు వెలుగులోకి రావడం కలకలం రేపింది.

ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో వెలుగుచూసింది. చిలుకోడుకు చెందిన గాదే రాజేశ్వరరావుకు 2016లో సూర్యాపేట జిల్లాకు చెందిన భవానితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అయితే తన భార్య భవానికి సైదులు అనే కొరియర్ బాయ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు రాజేశ్వరరావు ఆరోపించారు. ఈ విషయం గత నెల 27న తనకు తెలియడంతో రాజేశ్వరరావు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం తన అన్నను తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో సైదులు తనను వెంబడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అతని నుంచి తప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చిన రాజేశ్వరరావు.. తన భార్య ఫోన్‌ను పరిశీలించినట్లు తెలిపారు. అందులో తనను ఎలాగైనా చంపాలని, లేదంటే తాను చనిపోతానని భవాని సైదులుకు పంపినట్లు చెబుతున్న సందేశాలను గుర్తించినట్లు రాజేశ్వరరావు పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button