PoliticalTelangana

రాఘవాపురం పాఠశాలలో “నన్ను మరవొద్దు” అంటూ విద్యార్థుల వినూత్న ప్రదర్శన

రాఘవాపురం పాఠశాలలో "నన్ను మరవొద్దు" అంటూ విద్యార్థుల వినూత్న ప్రదర్శన

రాఘవాపురం పాఠశాలలో “నన్ను మరవొద్దు” అంటూ విద్యార్థుల వినూత్న ప్రదర్శన.

సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 21

ఆలేరు మండలం రాఘవాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం రోజున అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

భోజన విరామ సమయంలో అమ్మ భాష ప్రాముఖ్యతను తెలుపుతూ “నన్ను మరవొద్దు” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వినూత్నంగా ” అ” ఆకారంలో విద్యార్థులు కూర్చొని అమ్మ భాషపై తమ మక్కువను చూపారు.

ఏ భాషను నేర్చుకున్నా అమ్మ భాషను మరవబోమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యారాలు పరెడ్డి సుచరిత,ఉపాధ్యాయులు పాల్వంచ హరికిషన్, గంగ భాస్కర్, అల్లూరి సుదర్శన్ విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button