
ములుగు జిల్లాలో బీ.ఆర్.ఎస్‌కు అండగా లక్ష్మణ్‌బాబు దంపతులు.
“ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం..”
“అధికార పార్టీపై లక్ష్మణ్‌బాబు కీలక వ్యాఖ్యలు.”
“జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్ బాబు సేవలు అమోహం.”
“సర్పంచ్‌గా శ్రీలతకు ప్రజాదరణ.!”
“అధికార పార్టీ నాయకులకు చెమటలు పట్టిస్తున్న లక్ష్మణ్ బాబు ప్రశ్నలు”
“ఎన్నికల్లో ప్రజలే తీర్పు ఇస్తారు.!”
“అభివృద్ధి పేరుతో రాజకీయ పర్యటనలు చేస్తున్నారంటూ ఆరోపణ.?
“ఆరు గ్యారంటీలపై ప్రజల తరపున కారు పార్టీ ప్రశ్నలు.!”
“ప్రజలే అంతిమ నిర్ణేతలు.!”
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్.”
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, ఆయన సతీమణి, ఏటూరునాగారం సర్పంచ్ శ్రీలత చేస్తున్న సేవలు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు.
బీ.ఆర్.ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్‌బాబు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై గళమెత్తుతూ, బాధితులకు అండగా నిలుస్తున్నారని పేర్కొంటున్నారు. ప్రజల హక్కులు, అభివృద్ధి, సంక్షేమం, స్థానిక సమస్యల పరిష్కారం కోసం అధికారులను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు..
ఏటూరునాగారం సర్పంచ్‌గా శ్రీలత గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామంలోని మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు. మహిళా నాయకత్వానికి ఆదర్శంగా నిలుస్తూ ప్రజలకు చేరువగా ఉంటున్నారని పేర్కొంటున్నారు…అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులను కొనసాగిస్తూ వాటికి కొత్త రంగులు వేసి తమ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని లక్ష్మణ్‌బాబు విమర్శించారు.
ప్రజలను మభ్యపెట్టే ప్రచారాలకు కాలం చెల్లిందని, వాస్తవ పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు…అక్రమాలు, అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ నేతల తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల కంటే రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు..ములుగు జిల్లాలో గత 15 ఏళ్ల రాజకీయ పరిణామాలను ప్రజలు పరిశీలిస్తున్నారని లక్ష్మణ్‌బాబు అన్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా సమాధానం చెప్పే పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు…రాబోయే ఎన్నికల్లో ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని, బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు…ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తన పట్టు కొనసాగిస్తోందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందనే ఆందోళనతోనే అధికార పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాల పేరుతో జిల్లాలో వరుస పర్యటనలు చేస్తున్నారని లక్ష్మణ్‌బాబు ఆరోపించారు…
అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని, కేవలం ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను మానుకోవాలని ఆయన సూచించారు..అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరు నెలల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే హామీల అమలులో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని లక్ష్మణ్‌బాబు విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని చెబుతూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు…
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రజలు గుర్తించారని, రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలే తగిన సమాధానం చెబుతారని లక్ష్మణ్‌బాబు అన్నారు…ములుగు జిల్లాలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని లక్ష్మణ్‌బాబు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు..



