
రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్.. షాపుల్లోకి దూసుకెళ్లిన సిమెంట్ లారీ!
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కల్పతరువు రోడ్డు సమీపంలో శుక్రవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి అశ్వరావుపేట వైపు వెళ్తున్న ఒక సిమెంట్ లారీకి, ఎదురుగా రాంగ్ రూట్‌లో సడన్‌గా ఓ ట్రాక్టర్ అడ్డొచ్చింది. దీంతో డ్రైవర్ లారీని అదుపు చేయలేకపోవడంతో అది రోడ్డు పక్కనే ఉన్న షాపుల్లోకి దూసుకెళ్లింది.
అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో షాపుల్లో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో షాపు ముందు నిలిపి ఉంచిన స్కూటీ పూర్తిగా ధ్వంసమవ్వగా, లారీ ముందు భాగం అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న సత్తుపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




